Venkatesh: అందుకే అవి నన్నెప్పుడూ మార్చలేదు
విజయం వచ్చినా.. పరాజయం ఎదురైనా ఒకేలా ఉండటం కొందరికి మాత్రమే సాధ్యం. అలాంటి కొద్దిమందిలో నటుడు వెంకటేశ్ ఒకరు.
ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో విజయం వచ్చినా.. పరాజయం ఎదురైనా ఒకేలా ఉండటం కొందరికి మాత్రమే సాధ్యం. అలాంటి కొద్దిమందిలో నటుడు వెంకటేశ్ ఒకరు. ఆయన అలా ఉండేందుకు కారణం ఏంటో ఓ సందర్భంలో ఇలా పంచుకున్నారు. ‘జీవితంలో, సినిమాలో మూడు దశలుంటాయి. 1. పనిచేయడం, 2.ఫలితం గురించి ఆలోచించకుండా ఉండటం, 3. ఆ తర్వాత ఫలితం ఎలాంటిదైనా స్వీకరించడం. మంచో చెడో.. ఏదైనా కావొచ్చు. మనల్ని మనం స్వీకరించాలి. ఓ సినిమా ఫ్లాప్ అయితే.. మన పని అయిపోయింది అనే భయం మొదలవుతుంది. హిట్ అందుకుంటే మనమే గొప్ప అనే అతివిశ్వాసం పెరుగుతుంది. ఇవి రెండూ మంచివి కావు. అందుకే ఓ సినిమా చివరి దశలో ఉన్పప్పుడే నేను మానసికంగా బయటకు వచ్చేస్తా. తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తా. అందుకే హిట్లూ, ఫ్లాపులూ నన్ను ఎప్పుడూ మార్చలేకపోయాయి’ అని తెలిపారు. త్వరలో ‘నారప్ప’, ‘దృశ్యం 2’, ‘ఎఫ్ 3’ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు వెంకటేశ్. ఇప్పటికే ఆయన పాత్రలకు (నారప్ప, దృశ్యం 2) సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
CM KCR: విప్రహిత బ్రాహ్మణ సదన్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
India News
ఇకపై OTTలోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు.. కేంద్రం కీలక నిర్ణయం
-
World News
South Korea: కిమ్ ఉపగ్రహ ప్రయోగం.. దక్షిణ కొరియాపై ప్రజల ఆగ్రహం..!
-
India News
NIA: ప్రధాని హత్యకు కుట్రకేసులో ఎన్ఐఏ దాడులు..!
-
India News
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళనపై మీడియా ప్రశ్న.. కేంద్రమంత్రి పరుగులు
-
World News
Pakistan: పాక్‌కు మరో అవమానం.. ఆ దేశ విమానం మలేసియాలో సీజ్..!