Venkatesh: యువ దర్శకులతోనే...

ఈమధ్య కాలంలో సీనియర్‌ హీరోలు, యువ దర్శకుల కలయికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. యువతరంలోని ఉత్సాహం, కొత్త రకమైన ఆలోచనలు సీనియర్‌ హీరోల్ని కట్టిపడేస్తున్నాయి.

Updated : 09 Oct 2023 13:43 IST

ఈమధ్య కాలంలో సీనియర్‌ హీరోలు, యువ దర్శకుల కలయికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. యువతరంలోని ఉత్సాహం, కొత్త రకమైన ఆలోచనలు సీనియర్‌ హీరోల్ని కట్టిపడేస్తున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌... ఇలా సీనియర్లంతా కూడా ప్రస్తుతం యువ దర్శకులతో కలిసే ప్రయాణం చేస్తున్నారు. వెంకటేశ్‌ త్వరలోనే ‘సైంధవ్‌’తో సందడి చేయనున్నారు. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న చిత్రమది. తర్వాత కూడా వెంకీ యువ దర్శకులతోనే కలిసి సినిమాలు చేయనున్నట్టు తెలుస్తోంది. ‘డీజే టిల్లు’ ఫేమ్‌ విమల్‌కృష్ణ సహా పలువురు యువ దర్శకులు వెంకటేశ్‌కి కథ వినిపించారు. మరి ఆయన ఎవరితో జట్టు కడతారనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని