అమిత్‌షాతో చంద్రబాబు, పవన్‌ భేటీ.. ఎన్డీయేలోకి తెదేపాను ఆహ్వానించిన భాజపా

భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు.

Updated : 09 Mar 2024 12:17 IST

దిల్లీ : భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి భేటీ అయ్యారు. అమిత్‌షా నివాసంలో సుమారు 50 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో.. ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎన్డీయేలోకి తెదేపాను భాజపా ఆహ్వానించింది. త్వరలో జరగబోయే ఎన్డీయే భేటీకి తెదేపా హాజరయ్యే అవకాశం ఉంది. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని