Andhra News: పోలవరం నిధులు మింగేసిన జగన్‌ జైలుకెళ్లడం ఖాయం: దేవినేని ఉమా

పోలవరం నిర్వాసితులకు అందించాల్సిన డబ్బుల్ని ప్రభుత్వ పెద్దలు మింగేశారని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమా ఆరోపించారు.

Updated : 05 Jun 2022 16:35 IST

అమరావతి: పోలవరం నిర్వాసితులకు అందించాల్సిన డబ్బుల్ని ప్రభుత్వ పెద్దలు మింగేశారని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమా ఆరోపించారు. దీనికి కారణమైన సీఎం జగన్‌ జైలుకెళ్లడం ఖాయమన్నారు. ఇందులో పోలవరం, రంపచోడవరం ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ అనంతబాబు హస్తం ఉందన్నారు. పోలవరం ఎత్తు తగ్గించుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందంటూ తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటనను ముఖ్యమంత్రి జగన్‌ ఎందుకు ఖండించలేదని నిలదీశారు. కేసీఆర్‌ నుంచి ఎన్నికల నిధులు తెచ్చుకోవడం వల్లే జగన్‌ మిన్నకుండిపోయారని విమర్శించారు.

సీఎఫ్‌ఎంఎస్‌ నుంచి ఆఫ్‌లైన్‌ పేమెంట్లు జరుగుతున్నాయని దేవినేని ఉమా తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎఫ్‌ఎంఎస్‌ సిస్టంలో జరుగుతున్న పేమెంట్ల విధానంపై విచారణ జరిపితే జగన్‌ జైలుకెళ్లడం ఖాయమని తెలిపారు. రూ.లక్ష కోట్లకు బిల్లులు చెల్లిస్తే అందులో సజ్జల గిల్లుడు రూ.20వేల కోట్లని ఆరోపించారు. సీఎఫ్ఎంఎస్‌ విధానాన్ని మంచి కోసం ప్రవేశపెడితే .. ఆ వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. కాగ్‌ అడుగుతున్న ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని ఉమా ప్రశ్నించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని