Revanth Reddy: శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Published : 01 May 2024 10:46 IST

హైదరాదాద్‌: ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి అలుపెరగకుండా శ్రమిస్తున్న కార్మికులందరికీ ‘మే డే’ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం వారి అభ్యున్నతికి తప్పకుండా దోహదపడుతుందని చెప్పారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు.   

కార్మికుల శ్రమ వల్లే సమస్త సంపదలు: కేసీఆర్‌

శ్రామికుల విజయస్ఫూర్తిని చాటేరోజు ‘మే డే’ అని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. శ్రామిక జనుల విజయస్ఫూర్తిని చాటే ‘మే డే’ సందర్భంగా ఆయన ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా తెలంగాణ కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల శ్రమ వల్లే సమస్త సంపదలు సమకూరుతాయని చెప్పారు. వారికి శుభం చేకూరాలని మనసారా ఆకాంక్షిస్తున్నట్లు కేసీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని