Gangula Kamalakar: ఈటలకు దమ్ముంటే గజ్వేల్‌లో మాత్రమే పోటీ చేయాలి: గంగుల

భాజపా నేత ఈటల రాజేందర్‌కు దమ్ముంటే ఒక్క గజ్వేల్‌ నుంచి మాత్రమే పోటీ చేయాలని మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు.

Updated : 13 Oct 2023 13:38 IST

కరీంనగర్‌: భాజపా నేత ఈటల రాజేందర్‌కు దమ్ముంటే ఒక్క గజ్వేల్‌ నుంచి మాత్రమే పోటీ చేయాలని మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తానన్న ఎమ్మెల్యే ఈటల వ్యాఖ్యలపై.. కరీంనగర్ జిల్లా చింతకుంటలో మంత్రి ఘాటుగా స్పందించారు. హుజురాబాద్‌లో కూడా ఈటల బరిలోకి నిలుస్తున్నారంటే ఆయన భయపడ్డారా?అని ఎద్దేవా చేశారు. భాజపాకు తెలంగాణలో గుండు సున్నా వస్తుందని, ఆ భయంతోనే ఈటల రెండు చోట్ల పోటీ చేస్తానని అంటున్నారని విమర్శించారు. 

మరోవైపు, ఏపీ నేతలైన వైఎస్ షర్మిల, కేఏ పాల్, కేవీపీ రామచందర్ రావు, కిరణ్ కుమార్ రెడ్డిలకు తెలంగాణలో ఏం పని అంటూ గంగుల ప్రశ్నించారు. వారిని అసలే నమ్మొద్దని భాజపా ముసుగులో వచ్చి తెలంగాణను తిరిగి ఆంధ్రాలో కలపాలని కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని