Ashok Gajapathi Raju: జైల్లో పెడతామని బెదిరించారు: కేంద్రమాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు

ప్రస్తుత వేధింపుల పాలనను అంతం చేసి భావితరాలకు మంచి రాష్ట్రాన్ని ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర మాజీ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు పిలుపునిచ్చారు.

Updated : 06 Aug 2023 09:32 IST

పార్వతీపురం, న్యూస్‌టుడే: ప్రస్తుత వేధింపుల పాలనను అంతం చేసి భావితరాలకు మంచి రాష్ట్రాన్ని ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర మాజీ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు పిలుపునిచ్చారు. ఈ నెల 9న తెదేపా అధినేత చంద్రబాబు పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో శనివారం పార్వతీపురంలో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని అన్ని రంగాల అభివృద్ధి కుంటుపడింది. వైకాపా పాలనలో బెదిరింపులు ఎక్కువయ్యాయి. నన్ను కూడా జైల్లో పెడతామని బెదిరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి 6.5 లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. వీరంతా పేద, బడుగు బలహీన వర్గాలకు చెందినవారే’ అని పేర్కొన్నారు. సీఎం జగన్‌ అరాచకత్వంతో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని మాజీ మంత్రి కళావెంకటరావు ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని