RK Roja: తెదేపాను వీడినప్పటి నుంచి కక్ష కట్టారు: మంత్రి రోజా

పార్టీని వీడినప్పటి నుంచి నా జీవితాన్ని సర్వనాశనం చేయడానికి తెదేపా కంకణం కట్టుకుందని మంత్రి రోజా ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం తిరుపతి గ్రామీణ మండలం చిగురువాడ సమీపంలోని తన  నివాసంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు.

Updated : 04 Oct 2023 07:32 IST

తిరుపతి (గ్రామీణ), న్యూస్‌టుడే: పార్టీని వీడినప్పటి నుంచి నా జీవితాన్ని సర్వనాశనం చేయడానికి తెదేపా కంకణం కట్టుకుందని మంత్రి రోజా ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం తిరుపతి గ్రామీణ మండలం చిగురువాడ సమీపంలోని తన నివాసంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. ‘ఏదైనా మాట్లాడితే సినిమావాళ్లు అంటారు. తెదేపాను స్థాపించిన ఎన్టీఆర్‌ సినిమావారే కదా. నేను తెదేపాలో ఉన్నప్పుడు మంచి నాయకురాలిని. మీ పార్టీలో నచ్చక దండం పెట్టి బయటికి వచ్చేస్తే అశ్లీల చిత్రాల్లో నటించానంటూ వేధిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెడితే కడుపుమంటతో సీడీలు చూపించారు. వాటిని ప్రజలకు, విలేకర్లకు ఎందుకు ఇవ్వరు? నా క్యారెక్టర్‌ గురించి జడ్జి చేయడానికి మీరెవరు? నా కుటుంబం కోసం ఎవరి దగ్గరా చేయి చాచకుండా కష్టపడి పనిచేస్తున్నా’నని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని