తెదేపాలోకి మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి

ఉమ్మడి కడప జిల్లాలో పునర్విభజనలో రద్దయిన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి బుధవారం తెదేపాలో చేరనున్నారు.

Published : 03 Jan 2024 05:53 IST

నేడు చంద్రబాబు సమక్షంలో చేరిక

ఈనాడు, కడప: ఉమ్మడి కడప జిల్లాలో పునర్విభజనలో రద్దయిన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి బుధవారం తెదేపాలో చేరనున్నారు. ఆయన బావ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సునందరెడ్డి దంపతులు మినహా ఇతర కుటుంబసభ్యులంతా పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్‌లతో సంప్రదింపులు జరిపారు. ద్వారకనాథరెడ్డి మేనకోడలు అలేఖ్యరెడ్డి దివంగత సినీనటుడు నందమూరి తారకరత్న సతీమణి. 1994లో తెదేపా నుంచి ద్వారకానాథరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం రద్దు కాగా, పలు మండలాలు రాయచోటిలో విలీనమయ్యాయి. ఈసారి రాయచోటి నుంచి ఆయన టిక్కెట్‌ ఆశిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని