‘వివేకం’ సినిమా చూసి ఓటేయండి: డీఎల్‌ రవీంద్రారెడ్డి

ఓటర్లు ‘వివేకం’ సినిమా చూసి ఎన్నికల్లో ఓటేయాలని వైకాపా నేత, మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. కడప వైకాపా ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డికి తాను మద్దతు ఇవ్వడం లేదని, ‘వివేకం’ చిత్రం చూసి ఓట్లేయాల్సిందిగా తన వద్దకు వచ్చిన వారికి సూచిస్తున్నట్లు వెల్లడించారు.

Published : 10 Apr 2024 05:02 IST

మైదుకూరు, ఖాజీపేట, న్యూస్‌టుడే: ఓటర్లు ‘వివేకం’ సినిమా చూసి ఎన్నికల్లో ఓటేయాలని వైకాపా నేత, మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. కడప వైకాపా ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డికి తాను మద్దతు ఇవ్వడం లేదని, ‘వివేకం’ చిత్రం చూసి ఓట్లేయాల్సిందిగా తన వద్దకు వచ్చిన వారికి సూచిస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం వైయస్‌ఆర్‌ జిల్లా ఖాజీపేటలోని తన నివాసంలో విలేకర్లతో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కూటమే అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు పద్ధతి గల నాయకుడు. ఆయన మాత్రమే ప్రజలకు మేలు చేస్తారన్న నమ్మకం ఉంది. మైదుకూరు నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డికి ఓటు వేయొద్దు. తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌కే నా మద్దతు’ అని డీఎల్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని