రత్నగిరి-సింధుదుర్గ్‌ భాజపా అభ్యర్థిగా నారాయణ్‌ రాణె

కేంద్రమంత్రి నారాయణ్‌ రాణెను మహారాష్ట్రలోని రత్నగిరి-సింధుదుర్గ్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలో దింపాలని భాజపా నిర్ణయించింది.

Published : 19 Apr 2024 04:37 IST

ముంబయి: కేంద్రమంత్రి నారాయణ్‌ రాణెను మహారాష్ట్రలోని రత్నగిరి-సింధుదుర్గ్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలో దింపాలని భాజపా నిర్ణయించింది. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న శివసేన (యూబీటీ) అభ్యర్థి వినాయక్‌ రౌత్‌ ఇక్కడ ఆయనకు ప్రత్యర్థి. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు మహారాష్ట్ర మంత్రి ఉదయ్‌ సామంత్‌ సోదరుడు కిరణ్‌ గట్టి ప్రయత్నం చేసినా చివరకు ‘మహాయుతి’ పొత్తులో భాగంగా భాజపా దీనిని తీసుకుంది. ఇంతవరకు ఈ పార్టీ ఇక్కడ పోటీ చేయలేదు. చీలికకు ముందు శివసేనకు ఈ నియోజకవర్గం కంచుకోట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని