నవనీత్‌ రాణా.. ఓ నృత్యకారిణి

మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్న భాజపా అభ్యర్థి, సినీనటి నవనీత్‌ రాణాపై శివసేన(యూబీటీ) నేత సంజయ్‌రౌత్‌ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరతీశాయి.

Published : 19 Apr 2024 04:57 IST

సంజయ్‌ రౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

ముంబయి: మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్న భాజపా అభ్యర్థి, సినీనటి నవనీత్‌ రాణాపై శివసేన(యూబీటీ) నేత సంజయ్‌రౌత్‌ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరతీశాయి. ‘లోక్‌సభ ఎన్నికలు నృత్యకారిణి, బాబ్లీ (హిందీ చిత్రంలో పాత్ర)ల మధ్య పోటీ కాదు.. మహారాష్ట్ర ప్రభుత్వానికి, మోదీకి మధ్య. ఆమె ఓ నృత్యకారిణి, తెరపై ఆప్యాయతను ప్రదర్శించే నటి. ఈ మాయలో మీరు పడకండి’ అని అమరావతిలో కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు తెలుపుతూ జరిపిన ర్యాలీలో రౌత్‌ వ్యాఖ్యానించారు. 2022లో జరిగిన ఆందోళనల సమయంలో రాణా బలవంతంగా మాతోశ్రీ(ఠాక్రేల నివాసం)లోకి చొరబడేందుకు యత్నించిందని, హిందూ మతాన్ని దూషిస్తూ.. తమపై సవాలు విసిరిందని ఈ సందర్భంగా రౌత్‌ ఆరోపించారు. ఆమెను ఓడించడమే శివసేన మద్దతుదారుల కర్తవ్యమని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలను ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన సభ్యురాలు మనీషా కయాండే తీవ్రంగా ఖండించారు. హేమామలినిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుర్జేవాలాపై నిషేధం విధించినట్లుగానే రౌత్‌పై కూడా ఈసీ చర్యలు తీసుకోవాలంటూ డిమాండు చేశారు. మరోవైపు సంజయ్‌రౌత్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలో భాజపా, యువ స్వాభిమాన్‌ పార్టీల మహిళా కార్యకర్తలు ఆందోళనలకు దిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని