వైకాపా పాలనలో శిలాఫలకాలే మిగిలాయి

వైకాపా పాలన శిలాఫలకాలకే పరిమితమైందని.. అభివృద్ధి ఆచూకీ లేకుండా పోయిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.

Published : 20 Apr 2024 04:35 IST

పీసీసీ అధ్యక్షురాలు షర్మిల

ఆలూరు గ్రామీణ, ఆలూరు, న్యూస్‌టుడే: వైకాపా పాలన శిలాఫలకాలకే పరిమితమైందని.. అభివృద్ధి ఆచూకీ లేకుండా పోయిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. న్యాయయాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరులో ఆమె ప్రసంగించారు. ‘‘నగరడోణ జలాశయం ఏర్పాటు కోసం గతంలో రాజశేఖరరెడ్డి ఓ శిలాఫలకం ఆవిష్కరిస్తే.. దాని పక్కనే జగన్‌ మరోటి వేశారు తప్ప రిజర్వాయర్‌ పూర్తిచేయలేదు. కడప స్టీల్‌ప్లాంటుకూ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, జగన్‌.. ఇలా శంకుస్థాపనలే చేశారు. పాలనలు ఇలా శంకుస్థాపనలకే పరిమితమైతే..  అభివృద్ది ఏం జరుగుతుంది. ప్రజలు ఎలా బాగుపడతారు? పశ్చిమప్రాంత ప్రాంత రైతులను ఆదుకునేందుకు టమాటా జ్యూస్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని, ప్రాసెసింగ్‌ యూనిట్‌, కోల్డ్‌ స్టోరేజ్‌లు నిర్మిస్తామని చెప్పి అయిదేళ్లు పూర్తయ్యాయి. అవేమీ రాలేదు గానీ, ఎన్నికలు మళ్లీ వచ్చాయి. ఓటు ఇలాంటి వారికి వేసినా.. మురుగులో వేసినా ఒకటే. ఇలాంటి చెత్త నాయకులకు అధికారం కట్టబెట్టొద్దు. మంచివాళ్లకు ఓటు వేయకపోతే మీకు, మీ బిడ్డలకు భవిష్యత్తు ఉండదన్నారు. ఆదోని సభలో షర్మిల మాట్లాడుతుండగా.. వైకాపా నాయకులు ఓ మేడపై నుంచి ‘సిద్ధం’ జెండాలను చూపించారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. మిమ్మల్ని ఇంటికి సాగనంపేందుకు మేము సిద్ధమే అని ధీటుగా బదులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని