ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి

లోక్‌సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

Published : 28 Apr 2024 04:37 IST

డీజీపీని కలిసిన కాంగ్రెస్‌ నేతలు

నారాయణగూడ, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం కమిటీ సమన్వయకర్తలు పుష్పలీల, రాములు నాయక్‌, దివ్యవాణి, వినోద్‌రెడ్డి, కత్తి వెంకటస్వామి, టీపీసీసీ ఎలక్షన్‌ కమిటీ కన్వీనర్‌ కపిలవాయి దిలీప్‌కుమార్‌ మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు, ఎన్నికల సిబ్బందికి రక్షణ కల్పించాలని విన్నవించినట్లు చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాలు, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్న పార్టీలు, వ్యక్తులపై సైబర్‌ సెక్యూరిటీ యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. సోమవారం ఎన్నికల కమిషనర్‌ను కలిసి భద్రతా విషయంలో చర్యలు తీసుకోవాలని విన్నవిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని