MP Raghurama: ఫిబ్రవరి రెండో వారంలో పార్టీకి రాజీనామా చేస్తా: ఎంపీ రఘురామ

నియోజకవర్గానికి రాకుండా తనను ఇన్నాళ్లూ ఇబ్బంది పెట్టారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు.తన సొంత నియోజకవర్గానికి రాకుండా ఇన్నాళ్లూ ఇబ్బంది పెట్టారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు.

Published : 13 Jan 2024 16:34 IST

భీమవరం: సొంత నియోజకవర్గానికి రాకుండా తనను ఇన్నాళ్లూ ఇబ్బంది పెట్టారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తంచేశారు. రాజమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గాన భీమవరం చేరుకున్న రఘురామకు అభిమానులు, తెదేపా-జనసేన నేతలు ఘనస్వాగతం పలికారు. ‘‘తెదేపా, జనసేన కలిసిన రోజే కోస్తాలో వైకాపా పని అయిపోయింది. ఫిబ్రవరి రెండో వారంలో ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నా. అప్పటికి పొత్తుల అంశం ఖరారయ్యే అవకాశం ఉంది. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం తర్వాత భాజపాతో పొత్తు విషయం తేలుతుంది. మూడు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తాయని భావిస్తున్నా. తెదేపా-జనసేన కూటమి తరఫున పోటీకి నేను సిద్ధంగా ఉన్నా’’ అని రఘురామ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని