TS High Court: మంత్రి గంగుల కమలాకర్‌కు హైకోర్టులో ఊరట

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

Published : 08 Nov 2023 11:19 IST

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2018 ఎన్నికల్లో పరిమితికి మించి గంగుల కమలాకర్‌ ఎన్నికల ఖర్చు చేశారంటూ కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. సరైన ఆధారాలు లేవంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. మరోవైపు గంగుల ఎన్నికను రద్దు చేయాలంటూ భాజపా ఎంపీ బండి సంజయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని