Kiran Kumar Reddy: వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్‌ కుమార్‌రెడ్డి

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్‌సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 

Published : 28 Apr 2024 16:46 IST

రాయచోటి: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్‌సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలను వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిర్వహించిన రాష్ట్ర ప్రైవేటు విద్యా సంస్థల ఐకాస సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైకాపా పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎప్పుడు జమ అవుతుందో తెలియడం లేదని అన్నారు. విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని