Kishan Reddy: దివాళా దిశగా తెలంగాణ రాష్ట్రం: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
తెలంగాణ రాష్ట్రం దివాళా దిశగా సాగుతోందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. సికింద్రాబాద్లో జరిగిన భాజపా పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెరాస సర్కారుపై
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం దివాళా దిశగా సాగుతోందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. సికింద్రాబాద్లో జరిగిన భాజపా పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెరాస సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలు నివసించే ప్రాంతాల్లో రోడ్లు గతుకులమయంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్ నుంచి 80శాతం ఆదాయం వస్తున్నా అభివృద్ధి శూన్యమని విమర్శించారు. జీహెచ్ఎంసీ, జలమండలి ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితిలో ఉందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలు విసిగిపోయారని ధ్వజమెత్తారు. ఎనిమిదేళ్ల మోదీ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్న కిషన్రెడ్డి... ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించిందని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
‘1,400 ఎకరాల డీల్ కోసమే సీఎం జగన్తో అదానీ రహస్య భేటీ’
-
వైతెపా విలీనంపై 4 రోజుల్లో దిల్లీ నుంచి పిలుపు!
-
పాపులర్ అవ్వడానికి బదులు దూరమయ్యా: జాన్వీకపూర్
-
నేటి నుంచి ఆన్లైన్ గేమింగ్ పూర్తి పందెం విలువపై 28% జీఎస్టీ
-
‘ఆస్కార్ విజేత’ పింకీ.. ఇపుడు నవ్వటం లేదు!
-
తెదేపా, జనసేన కలిసినా మాకేమీ నష్టం లేదు: మంత్రి బొత్స