ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు

‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు.

Updated : 03 May 2024 07:11 IST

వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి

ఆత్మకూరు, న్యూస్‌టుడే: ‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. పరస్పర అంగీకారం లేని అంశాలను వ్యతిరేకిస్తాం’ అని నెల్లూరు వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం ఆయన ఆత్మకూరులో స్థానికులు, విలేకర్లతో మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి ప్రత్యేక మ్యానిఫెస్టో సిద్ధం చేశామని తెలిపారు. ఆత్మకూరు అభివృద్ధికి తలపెట్టిన రోడ్లు, మురుగు కాలువల నిర్మాణ పనుల వివరాలను ఆయన వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని