Kolusu parthasarathi: అటాచ్‌మెంట్‌లో ఉన్న భూములు కొనడం ఎంతవరకు సబబు?: మంత్రి పార్థసారథి

Eenadu icon
By Politics News Team Updated : 14 Aug 2024 15:44 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మంగళగిరి: మాజీ మంత్రి జోగి రమేశ్‌ కుమారుడు అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో అరెస్టవ్వడంలో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. వైకాపా ప్రతి అంశాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకోవడం సిగ్గుచేటని అన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వానికి కక్ష సాధించాలని ఉంటే వైకాపా నేతలు బయటికి వచ్చి ఈ విధంగా మాట్లాడతారా అని ప్రశ్నించారు. చట్టానికి ఓసీ, బీసీ అని ఉండదన్నారు. ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న తమ భూములు అన్యక్రాంతం అవుతున్నాయని అగ్రిగోల్డ్‌ ఫిర్యాదు మేరకే విచారించి చర్యలు తీసుకున్నారని తెలిపారు. 

ఆనాడు మంత్రిగా ఉన్న జోగి రమేశ్‌ అధికార దుర్వినియోగంతో చట్ట వ్యతిరేకంగా భూములు కొని విక్రయించారని మంత్రి పార్థసారథి ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా అగ్రిగోల్డ్‌ ఆస్తులు సొంతం చేసుకోవాలని ప్రయత్నించిందని దుయ్యబట్టారు. అగ్రిగోల్డ్‌ వ్యవహారానికి కులం, మతం, రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మొదటి నుంచి రాజకీయ కక్షసాధింపు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తున్నారని తెలిపారు. పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్లను ఆనాడు జగన్‌ కక్షపూరితంగా రద్దు చేయించారని మంత్రి మండిపడ్డారు.

Tags :
Published : 14 Aug 2024 13:26 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు