YSRCP: మైలవరం ఇన్‌ఛార్జిగా తిరుపతిరావు.. ఎమ్మెల్యే వసంత పయనం ఎటు?

ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం అసెంబ్లీ వైకాపా (YSRCP) ఇన్‌ఛార్జిగా జడ్పీటీసీ సభ్యుడు స్వర్ణాల తిరుపతిరావును పార్టీ అధిష్ఠానం నియమించింది.

Updated : 02 Feb 2024 20:49 IST

విజయవాడ: ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం అసెంబ్లీ వైకాపా (YSRCP) ఇన్‌ఛార్జిగా జడ్పీటీసీ సభ్యుడు సర్నాల తిరుపతిరావు యాదవ్‌ను పార్టీ అధిష్ఠానం నియమించింది. శుక్రవారం తిరుపతిరావు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ (YS Jagan)ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

మైలవరం అసెంబ్లీ ఇన్‌ఛార్జి మార్పుపై మంత్రి జోగి రమేశ్‌, ఎంపీ కేశినేని నానితో సీఎం చర్చించారు. నేతల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఇన్‌ఛార్జి మార్పుపై నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ (Vasantha Krishna Prasad) ఇప్పటివరకు నియోజకవర్గ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న వసంత కృష్ణప్రసాద్‌ తాజా రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నా రాజకీయ భవిష్యత్తు.. ఎప్పుడు చీకటి పడుతుందా? ఎప్పుడు తెల్లారుతుందా? అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఎదురు చూడటమే ఎమ్మెల్యేల పనిగా మారింది. ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాక వైకాపా నేతలు ఆస్తులు అమ్ముకున్నారు. బిల్లుల బకాయిల కోసం కాంట్రాక్టర్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత, మంత్రి జోగి రమేశ్‌ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇద్దరు నేతలను.. సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయానికి పిలిచి మాట్లాడినా పరిస్థితి మారలేదు. ఈ క్రమంలో తాజాగా మైలవరం ఇన్‌ఛార్జిని మార్చడంతో వసంత కృష్ణప్రసాద్‌ రాజకీయ భవిష్యత్తు ఏంటనేది చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని