Somu Veerraju: అధిష్ఠానం నిర్ణయం మంచి సంకేతం: సోము వీర్రాజు

ఏపీ భాజపా చీఫ్‌గా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని అధిష్ఠానం నియమించడంపై  మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.

Updated : 04 Jul 2023 19:27 IST

అమరావతి: ఏపీ భాజపా చీఫ్‌గా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని అధిష్ఠానం నియమించడంపై  మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. రాష్ట్ర ప్రజలకు మంచి సంకేతం ఇచ్చే నిర్ణయాన్ని పార్టీ అధిష్ఠానం తీసుకుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘‘భాజపాకు ఎప్పుడైనా దేశమే ప్రధానం. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా.. అంగీకరిస్తా. పురందేశ్వరి నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తాం. రాజకీయాల్లో ఫిర్యాదులు కొత్తేమి కాదు. ఫిర్యాదులకు నా శరీరం అలవాటు పడింది. నాపై ఎవరు ఫిర్యాదు చేశారో? వ్యతిరేకులెవరో నాకు తెలియదు. నేను పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలవలేనని కొందరు విమర్శిస్తారు. 1978 నుంచి భాజపాలోనే ఉన్నా.. నా పార్టీ భాజపా. ఏపీలో పార్టీ బలోపేతం కోసం శాయశక్తులా కృషి చేశా’’అని సోము వీర్రాజు తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని