Ayyanna: విజయసాయికి రూ.300 కోట్ల భూమి గిఫ్ట్‌గా ఇచ్చేందుకు జగన్‌ యత్నం: అయ్యన్న

విశాఖలోని భీమునిపట్నం ప్రాంతం తుర్లవాడ కొండపై 120 ఎకరాలు కాజేసేందుకు.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కుట్ర పన్నారని మాజీ మంత్రి, తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

Updated : 22 Aug 2023 12:49 IST

విశాఖ: విశాఖలోని భీమునిపట్నం ప్రాంతం తుర్లవాడ కొండపై 120 ఎకరాలు కాజేసేందుకు.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కుట్ర పన్నారని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. తుర్లవాడ ఆధ్యాత్మిక క్షేత్రమని.. దీని జోలికి రావొద్దన్నారు. విజయసాయిరెడ్డి తన కుమార్తె విద్యాసంస్థల నిర్మాణం కోసం ఇక్కడ 120 ఎకరాలు కేటాయించాలని సీఎం జగన్‌ను కోరారన్నారు. రూ.300 కోట్ల విలువైన ఈ భూమిని విజయసాయిరెడ్డికి బహుమతిగా ఇవ్వడానికి సీఎం యత్నిస్తున్నారని ఆరోపించారు.

ప్రజల ఆస్తిని జగన్రెడ్డి ఇష్టమొచ్చినట్లుగా దానం చేస్తున్నారని అయ్యన్న దుయ్యబట్టారు. కొండపై 120 అడుగుల నరసింహస్వామి విగ్రహం ప్రతిష్ఠించాలని స్థానికులు తెదేపాని కోరుతున్నారన్నారు. ఇప్పటికే తితిదే, సింహాచలం ఆస్తులు దోచేశారని ఆరోపించారు. దేవుడిని టచ్ చేయవద్దని జగన్ రెడ్డిని కోరుతున్నామన్నారు. ఇప్పటికే విశాఖలో జగన్ రెడ్డి అండ్ కో.. రూ.70 వేల కోట్ల ఆస్తులు దోచుకున్నారన్నారు. రుషికొండపై మంత్రి రోజా పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. విశాఖలో దోపిడీపై సీనియర్ నేతలు బొత్స, ధర్మాన ఎందుకు మాట్లాడటం లేదని అయ్యన్న నిలదీశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు