Atchannaidu: చంద్రబాబును జైలులో ఏమైనా చేస్తారనే అనుమానం ఉంది: అచ్చెన్న

రాష్ట్రంలోని పరిణామాలను గమనిస్తున్నట్లు ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ చెప్పారని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయడు అన్నారు.

Updated : 11 Sep 2023 14:18 IST

విశాఖపట్నం: రాష్ట్రంలోని పరిణామాలను గమనిస్తున్నట్లు ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ చెప్పారని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. విశాఖ పోర్టు గెస్ట్‌హౌస్‌లో అచ్చెన్న నేతృత్వంలో తెదేపా నేతలు గవర్నర్‌ను కలిశారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌ అనంతరం జరిగిన పరిణామాలు, ఏపీ పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్న మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పరిణామాలపై గవర్నర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. తనకు కూడా తెలియకుండా అరెస్టు చేసినట్లు గవర్నర్‌ తెలిపారని అచ్చెన్న చెప్పారు.

AP CID: ప్రెస్‌మీట్‌లో ఒక మాట.. రిమాండు రిపోర్టులో మరో పాట

వైకాపా పరిస్థితి ప్రమాదకరంగా ఉంది

‘‘రాజకీయ కక్షతో చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. నాలుగేళ్ల పాలనలో అవినీతి కనిపించలేదా.. ఇప్పుడే ఎందుకు తెలిసింది. తెదేపా ఒంటరిగా పోటీ చేసినా 15 ఎంపీ సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. జనసేనతో కలిసి పోటీచేస్తే వైకాపా చిరునామా గల్లంతవుతుందని సర్వేలు చెబుతున్నాయి. వైకాపా పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఐప్యాక్‌ సర్వేలో తేలింది. లోకేష్‌ పాదయాత్రను అణచివేయాలని యత్నించారు. కావాలని చంద్రబాబును జైలుకు పంపడం దారుణం. 48 గంటల పాటు రోడ్లపై తిప్పి సైకో ఆనందం పొందారు. చంద్రబాబు మనో ధైర్యాన్ని ఎప్పటికీ తొలగించలేరు. తెదేపాకు సంక్షోభాలు కొత్తకాదు. సంక్షోభాలను అవకాశంగా మలుచుకుని ముందుకెళ్తాం. ఈ కేసుతో తెదేపా నేతలకు సంబంధం ఏంటి? తప్పుడు ఆలోచన గల వ్యక్తులు ఉన్న ప్రభుత్వం ఇది. చంద్రబాబును జైలులో ఏమైనా చేస్తారనే అనుమానం ఉంది’’ అని అచ్చెన్న వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని