Yuvagalam: తెదేపా ‘యువగళం’ క్యాంప్‌ సైట్‌పై దాడి.. పోలీసుల అదుపులో 50 మంది వాలంటీర్లు!

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం బేతపూడి వద్ద  తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర క్యాంప్‌ సైట్‌పై పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు.

Updated : 06 Sep 2023 11:02 IST

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం బేతపూడి వద్ద  తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర క్యాంప్‌ సైట్‌పై పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. 3 వాహనాల్లో వచ్చిన పోలీసులు.. యువగళం వాలంటీర్లు, కిచెన్‌ సిబ్బంది సహా సుమారు 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు తమపై విచక్షణారహితంగా దాడి చేశారని వాలంటీర్లు ఆరోపిస్తున్నారు. 

మంగళవారం రాత్రి వైకాపా నేతలు, కార్యకర్తలు పక్కాగా కాపుకాచి లోకేశ్‌ పాదయాత్రపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు తెదేపా నేతలు, కార్యకర్తలతో పాటు పోలీసులలకు గాయాలయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలోనే యువగళం వాలంటీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న వారిని రాత్రి నుంచి పోలీసులు వివిధ ప్రాంతాల్లో తిప్పుతున్నారు. భీమవరం, నర్సాపురం, వీరవాసరం కాళ్ల పోలీస్‌స్టేషన్లు తిప్పారు. ప్రస్తుతం వారిని సిసిలిలోని రాజ్యలక్ష్మి మెరైన్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఫ్యాక్టరీలో ఉంచారు. 

యువగళం యాత్రపై వైకాపా రాళ్ల వర్షం

అదుపులోకి తీసుకున్న వాలంటీర్లపై సెక్షన్‌ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. యువగళం పాదయాత్రకి అనుమతి ఇచ్చి అదే రూట్‌లో వైకాపా కార్యకర్తలు కవ్వింపు చర్యలు.. రాళ్ల దాడి చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని