AP News: శాసనమండలి రద్దు నిర్ణయం వెనక్కి: బుగ్గన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర శాసనమండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర శాసనమండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. మంగళవారం ఈ మేరకు ఆయన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జనవరి 27, 2020న కౌన్సిల్‌ను రద్దు చేస్తూ తీర్మానం చేశామని, ఇన్నాళ్లు ఒక సందిగ్ధత నెలకొందని అన్నారు. శాసన మండలిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సభకు వివరించారు. మండలి రద్దు ఉపసంహరణ తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. ‘‘వివిధ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని, అవన్నీ కూడా చాలా త్వరగా చట్టం రూపంలో అమలు కావాలని ఒక ఉద్దేశం ఉంది. వివిధ కారణాల వల్ల అవి ఆలస్యమయ్యాయి. అప్పటి నిర్ణయాలపై అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులే ఎప్పుడైనా సుప్రీమ్. అయితే, ఒక సూచన, సలహా ఇవ్వడానికి మండలి అవసరం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అసలు శాసనమండలే లేదు. ప్రజల కోసం మంచి చట్టాలు తీసుకురావాలన్నా, సవరించాలన్నా ఆ బాధ్యత అసెంబ్లీకి మాత్రమే ఉంటుంది. శాసనసభలో కూడా విద్యావంతులైన ఎంతోమంది సభ్యులు ఉన్నారు. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వారికి ఉంది. అందుకే జనవరి 27, 2020న కౌన్సిల్‌ను రద్దు చేస్తూ తీర్మానం చేశాం. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయమది. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వానికి, హోమ్ మినిస్టరీకి సమాచారం అందించాం. ఇన్ని రోజులైనా కూడా అక్కడి నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో ఒక సందిగ్ధత నెలకొంది. ఇటీవల శాసనమండలి ఛైర్మన్‌ను కూడా ఎన్నుకున్నాం. ఆయన కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఒక సామాన్యుడు ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చన్న సందేశాన్ని జగన్ ప్రభుత్వం చాటి చెప్పింది. పాత సభ్యులతో పాటు, కొత్త సభ్యులు కూడా ఉత్సాహంగా పనిచేయాలన్న ఉద్దేశంతోనే, శాసనసభ తీసుకునే నిర్ణయాలకు మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలన్న ఆకాంక్షతో శాసనమండలిని కొనసాగించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది’’ అని బుగ్గన శాసనసభకు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. -
పిఠాపురంలో పవన్‌కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఘోర బస్సు ప్రమాదం.. పాక్‌లో 20 మంది దుర్మరణం
-
ప్రభాకర్‌రావు కోసం పోలీసుల వేట .. అరెస్టు వారెంట్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్
-
50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని దాటిన హైదరాబాద్ మెట్రో
-
వివాహిత ఇంటికి బాంబు పార్సిల్ పంపిన ప్రియుడు.. భర్త, కుమార్తె మృతి
-
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల