Somireddy: ఎంపీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలోనే సిలికా అక్రమ తవ్వకాలు: సోమిరెడ్డి

సిలికా అక్రమ తవ్వకాలపై తిరుపతి కలెక్టర్‌ వెంకట రమణారెడ్డికి మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.

Updated : 18 Nov 2023 16:24 IST

తిరుపతి: సిలికా అక్రమ తవ్వకాలపై తిరుపతి కలెక్టర్‌ వెంకట రమణారెడ్డికి మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయమై 15 రోజుల్లో హైకోర్టుకు వెళ్తామని చెప్పారు. ‘‘దోచుకొని దాచుకున్న వారిని వదిలిపెట్టేది లేదు. ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలోనే సిలికా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. దీనిపై సీబీఐ విచారణ చేయించాలి’’ అని సోమిరెడ్డి డిమాండ్‌ చేశారు.

సామాజిక వైఫల్య యాత్ర


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని