YSRCP: నియోజకవర్గ ఇన్‌ఛార్జిల మార్పు.. వైకాపా నాలుగో జాబితా విడుదల

సుదీర్ఘ కసరత్తు తర్వాత వైకాపా మరికొన్ని స్థానాలకు ఇన్‌ఛార్జిలను మార్పు చేసింది.

Updated : 18 Jan 2024 22:35 IST

అమరావతి: సుదీర్ఘ కసరత్తు తర్వాత వైకాపా మరికొన్ని స్థానాలకు ఇన్‌ఛార్జిలను మార్పు చేసింది. ఒక పార్లమెంట్‌, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నాలుగో జాబితాను గురువారం రాత్రి మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు విడుదల చేశారు. రీజినల్‌ కోఆర్డినేటర్లు, ముఖ్యనేతలతో చర్చించిన అనంతరం ఈమేరకు సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడో జాబితాలో 21 స్థానాలకు ఇన్‌ఛార్జిలను ప్రకటించిన విషయం తెలిసిందే.

అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు వీరే..

  • జీడీ నెల్లూరు (ఎస్సీ) - ఎన్‌. రెడ్డప్ప
  • శింగనమల (ఎస్సీ) - ఎం. వీరాంజనేయులు
  • తిరువూరు (ఎస్సీ) - నల్లగట్ల స్వామిదాసు
  • కొవ్వూరు (ఎస్సీ) - తలారి వెంకట్రావు
  • నందికొట్కూరు (ఎస్సీ) - సుధీర్‌ దార
  • మడకశిర (ఎస్సీ) - ఈర లక్కప్ప
  • కనిగిరి - దద్దాల నారాయణయాదవ్‌
  • గోపాలపురం (ఎస్సీ) - తానేటి వనిత (హోం మంత్రి)
  • చిత్తూరు పార్లమెంట్‌ (ఎస్సీ) - కె. నారాయణస్వామి
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని