TDP: ఆకివీడు పీఎస్‌కు ‘యువగళం’ వాలంటీర్లు.. భారీగా చేరుకున్న తెదేపా కార్యకర్తలు

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి తెల్లవారుజామున తీసుకొచ్చిన తెదేపా ‘యువగళం’ వాలంటీర్లను ఆకివీడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Published : 06 Sep 2023 15:05 IST

ఆకివీడు: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి తెల్లవారుజామున తీసుకొచ్చిన తెదేపా ‘యువగళం’ వాలంటీర్లను ఆకివీడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉదయం నుంచి కాలకృత్యాలు కూడా తీర్చుకోనీయకుండా పోలీసులు వారిని తిప్పుతున్నారు. యువగళం వాలంటీర్లతో పాటు వంటచేసేవారిని, వాహన డ్రైవర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ ఆకివీడు పీఎస్‌కు తీసుకొచ్చిన నేపథ్యంలో భారీగా తెదేపా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. 

దీంతో యువగళం వాలంటీర్లు ఉన్న వాహనాలను మరో ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేయగా కార్యకర్తలు అడ్డుకున్నారు. పీఎస్‌ బయట, వాహనం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. యువగళం వాలంటీర్లను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ప్రశాంతంగా జరుగుతున్న పాదయాత్రలో అలజడి సృష్టించి రాళ్ల దాడి చేసిన వైకాపా కార్యకర్తలను వదిలి.. యువగళం వాలంటీర్ల వేధిస్తున్నారని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు