WI vs IND: ‘యూఎస్ఏ’ పేరు వినగానే మీకేమనిపిస్తుంది..? భారత క్రికెటర్లు ఎవరేం చెప్పారంటే?

వెస్టిండీస్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌ (WI vs IND) ఆడేందుకు భారత్‌ యూఎస్‌ఏలోని ఫ్లోరిడాకు చేరింది. ఈ క్రమంలో అగ్రరాజ్యమైన యూఎస్‌ఏ పేరు వినగానే ఏమని అనిపిస్తుందని భారత క్రికెటర్లకు సరదా ప్రశ్న ఎదురైంది. మరి వారేం చెప్పారో తెలుసుకుందామా..

Published : 12 Aug 2023 15:43 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం విండీస్‌తో టీ20 సిరీస్‌ (WI vs IND) ఆడుతోంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా చివరి రెండు మ్యాచ్‌లు ఆడేందుకు టీమ్‌ఇండియా క్రికెటర్లు యూఎస్‌ఏకు చేరుకున్న విషయం తెలిసిందే. ఫ్లోరిడాలోని లాడర్‌హిల్స్ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా క్రికెటర్లను యూఎస్ఏ పేరు వినిపించగానే ఏమనిపిస్తుందని చెప్పమంటూ సరదాగా చేసిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌లో పోస్టు చేసింది. కొందరేమో లైఫ్‌స్టైల్‌, రిలేటివ్స్‌, ఫ్యాషన్‌ అంటూ రకరకాల ఫన్నీ ఆన్సర్లు ఇచ్చారు. మరి ఎవరు ఏం సమాధానం ఇచ్చారో ఓసారి చూసేద్దామా...

ప్రశ్న: యూఎస్‌ఏ అని పేరు వినిపించగానే మీ మదిలో ఏమని అనిపిస్తుంది? 

కెప్టెన్ హార్దిక్‌ పాండ్య: యూఎస్.. చాలా మంది కల. 

అర్ష్‌దీప్‌ సింగ్‌: మియామీ, షాపింగ్‌. (ఈ రెండింట్లో ఏది ఫస్ట్‌ అనేదానికి మాత్రం మియామీ అని సమాధానం ఇచ్చాడు).

యశస్వి జైస్వాల్‌: జీవన శైలి. ఇక్కడి ప్రజల లైఫ్‌స్టైల్ విభిన్నంగా ఉంటుంది. 

చాహల్‌: నాకు మాత్రం యూఎస్‌ఏ అనగానే జీటీఏ గుర్తుకొస్తుంది. గ్రాండ్‌ థెఫ్ట్‌ ఆటో (GTA) అనే యాక్షన్-అడ్వంచర్‌ వీడియో గేమ్ సిరీస్. నేను కూడా జీటీఏ ఆడతా. 

కుల్‌దీప్ యాదవ్‌: నాకు లియోనెల్‌ మెస్సి గుర్తుకొస్తాడు. ఎక్కడికి వెళ్లినా అతడికి అభిమానులు భారీగా ఉంటారు. అందులో నేను కూడా ఒకడిని. నేనే కాదు మన జట్టులోనూ అతడికి ఫ్యాన్స్‌ చాలా మంది ఉన్నారు. (మెస్సి ఇటీవలే మియామీలోని మేజర్ లీగ్ సాసర్‌ క్లబ్‌కు మారిపోయాడు)

సూర్యకుమార్‌ యాదవ్‌: ఐస్‌క్రీమ్‌. మరీ ముఖ్యంగా నాకెంతో ఇష్టమైన చీజ్‌ కేక్‌. ఇప్పుడు మాత్రం తినలేకపోతున్నా. 

ఇషాన్‌ కిషన్: నాకు యూఎస్‌ఏ అంటేనే వేడి, ఉక్కపోత గుర్తుకొస్తాయి. వాటి నుంచి దూరంగా వెళ్లాలనిపిస్తుంది. 

తిలక్‌ వర్మ: ఇక్కడ తక్కువగా క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఇప్పుడు యూఎస్‌ఏకు రావడం ఆనందంగా ఉంది. ఇక్కడ పిచ్‌లపై ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నా.

శుభ్‌మన్‌ గిల్‌: నాకు మా చుట్టాలు గుర్తుకొస్తారు. నేను పంజాబీ. మాకు ఇక్కడ చాలా మంది బంధువులు ఉన్నారు. యూఎస్ఏ పేరు వినగానే వారే గుర్తుకు వస్తారు. 

అవేశ్‌ ఖాన్‌: నేను తొలి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు ఇక్కడే తీసుకున్నా. 

ముకేశ్‌ కుమార్‌, సంజూ శాంసన్‌: యూఎస్‌ఏ అంటే అమెరికా అని గుర్తొస్తుంది. (నవ్వుతూ)


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని