హార్దిక్‌ ధైర్యాన్ని నటిస్తున్నాడు

ముంబయి ఇండియన్స్‌ సారథి హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ తప్పుబట్టాడు. కెప్టెన్‌గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు.

Published : 11 May 2024 02:43 IST

జొహానెస్‌బర్గ్‌: ముంబయి ఇండియన్స్‌ సారథి హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ తప్పుబట్టాడు. కెప్టెన్‌గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. అతను ధైర్యాన్ని నటిస్తున్నాడని, జట్టులోని అనుభజ్ఞులైన ఆటగాళ్లకు అది రుచించదని పేర్కొన్నాడు. ‘‘హార్దిక్‌ కెప్టెన్సీ శైలి కాస్త ధైర్యంతో, ఓ రకంగా అహంకారంతో, ఛాతీ విరుచుకుని ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ అతను మైదానంలో నడిచే తీరు ఎల్లప్పుడూ వాస్తవికంగా ఉన్నట్లు అనిపించడం లేదు. కెప్టెన్‌గా అలాగే ఉండాలని అతను నిర్ణయించుకున్నాడు. ధోనీలా ప్రశాంతంగా, ఓపికగా అందరినీ కలుపుకొని పోయేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పుడు ఇలాంటిది పనిచేయదు. గుజరాత్‌ యువ జట్టుకు సారథిగా హార్దిక్‌కు అది కలిసొచ్చింది. కానీ ముంబయికి ఆ ధైర్యం అవసరం లేదు. నేను హార్దిక్‌ను విమర్శించట్లేదు. అతని ఆటను చూడటాన్ని ప్రేమిస్తా. ఛాతీ విరుచుకుని ఉంటే చూడటానికి ఇష్టపడతా. ఎందుకంటే నేనూ అలాగే ఉండేవాణ్ని’’ అని డివిలియర్స్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని