WTC Final : టెస్టు మహాసమరంలో విజేత ఆస్ట్రేలియానే..

డబ్ల్యూటీస్‌ ఫైనల్‌(WTC Fina) విజేతగా ఆస్ట్రేలియా(Australia) నిలిచింది. ఫైనల్‌ పోరులో భారత్‌పై 209 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో రెండోసారి కూడా టీమ్‌ఇండియాకు నిరాశే మిగిలింది.

Updated : 11 Jun 2023 19:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టెస్టు క్రికెట్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే WTC Final 2023లో మరోసారి భారత్‌(Team India) పేలవ ప్రదర్శన చేసింది. దీంతో ఈ మహాసమరం(India vs Australia)లో ఆస్ట్రేలియా(Australia) జగజ్జేతగా నిలిచి సత్తా చాటింది. వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరిన భారత్‌.. ఈ సారైన టైటిల్‌ గెలిచి ఐసీసీ ట్రోఫీల కరవును తీర్చుతుందన్న అభిమానుల ఆశలపై రోహిత్‌ సేన నీళ్లు చల్లింది. అన్ని విభాగాల్లో విఫలమై.. కీలకమైన పోరులో మరోసారి తడబాటుకు గురై 209 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఐసీసీ(ICC) ట్రోఫీ భారత్‌కు కలగానే మిగిలిపోయింది. 

 

ఆసీస్‌ నిర్దేశించిన 444 పరుగుల ఛేదనలో 164/3తో చివరి రోజు ఆటను ప్రారంభించిన టీమ్‌ ఇండియా.. ఆసీస్‌ బౌలింగ్‌ ధాటికి నిలువలేకపోయింది. తొలి సెషన్‌లో మరో 70 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది. రికార్డు ఛేజింగ్‌లో ఆశలు రేపిన కోహ్లీ, రహానె వికెట్లు పడిపోవడంతో.. టీమ్‌ఇండియా పతనం ప్రారంభమైంది. అర్ధశతకానికి చేరువలో కోహ్లీ(49) బోలాండ్‌ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన జడేజా పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. రహానె(46) కూడా ఆ తర్వాత ఎక్కువ సేపు నిలవలేదు. స్టార్క్‌ బౌలింగ్‌లో అలెక్స్‌ కారేకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. శార్దూల్‌ ఠాకూర్‌ ఎల్బీగా దొరికిపోగా.. చివర్లో కేఎస్‌ భరత్‌ (23) కాసేపు క్రీజ్‌లో నిలించేందుకు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరాడు.

స్కోరు వివరాలు: 

భారత్‌ : తొలి ఇన్నింగ్స్‌: 296 /10.. రెండో ఇన్నింగ్స్‌ : 234/10
ఆస్ట్రేలియా : తొలి ఇన్నింగ్స్‌ : 469/10.. రెండో ఇన్నింగ్స్‌ : 270-8 (డిక్లేర్డ్‌)

చరిత్ర సృష్టించిన ఆసీస్‌..

డబ్ల్యూటీసీ విజేతగా నిలవడంతో ఆస్ట్రేలియా ఐసీసీ ట్రోఫీల్లో చరిత్ర సృష్టించింది. అన్ని ఐసీసీ టైటిళ్లు గెలిచిన తొలి జట్టుగా ఆసీస్‌ నిలిచింది. వన్డే ప్రపంచకప్‌, టీ20 వరల్డ్‌కప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన ఆసీస్‌.. తాజాగా డబ్ల్యూటీసీ టైటిల్‌ గెలిచి మొత్తం నాలుగు ఐసీసీ టైటిళ్లు సొంతం చేసుకున్న ఏకైక జట్టుగా అవతరించింది.

మ్యాచ్‌లోని కీలక అంశాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు