WTC Final : ఇలాంటి ఆటతో గెలుపును ఎలా ఆశిస్తారు..? : గావస్కర్‌

WTC Finalలో భారత్‌ ఘోర ఓటమిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్‌ సేన పేలవ ప్రదర్శనపై మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Published : 12 Jun 2023 01:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : ద్వైపాక్షిక సిరీస్‌ల్లో రాణిస్తున్నా.. ప్రతిష్ఠాత్మక ఐసీసీ(ICC) టోర్నీలకు వచ్చేసరికి టీమ్‌ఇండియా(Team India) చేతులెత్తేస్తోంది. రెండోసారి WTC Final చేరినప్పటికీ.. ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైంది. కీలక సమరం(India vs Australia)లో అన్ని విభాగాల్లో విఫలమై.. రోహిత్‌ సేన చేజేతులా ఓడిపోయింది. ఈ ఓటమిపై మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) స్పందించాడు. భారత బ్యాటింగ్‌ కుప్పకూలిందంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

భారత ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్‌ వైఫల్యమేనని గావస్కర్‌ పేర్కొన్నాడు. ‘తొలి ఇన్నింగ్స్‌తోపాటు రెండో ఇన్నింగ్స్‌లోనూ టీమ్‌ఇండియా బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసింది. ఆసీస్‌కు భారీ ఆధిక్యాన్ని అందించాం. ఇక అక్కడి నుంచి తిరిగి పుంజుకోవడమేనేది అంత సులభం కాదు’ అని సన్నీ పేర్కొన్నాడు.

‘ఈరోజు బ్యాటింగ్‌ పూర్తిగా కుప్పకూలింది. నేడు మనం చూసిన ఆట ఎంత దారుణంగా ఉందో చూడండి. షాట్‌ సెలక్షన్‌ తీసుకుంటే.. పుజారా నుంచి నిన్న ఓ సాధారణ షాట్‌ చూశాం. అలాంటివే ఈరోజు కూడా చూశాం. ఇలాంటి ఆటతో.. విజయాన్ని ఎలా ఆశిస్తారు?’ అంటూ గావస్కర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. చేతిలో ఏడు వికెట్లు ఉన్నా.. ఒక్క సెషన్‌ కూడా పూర్తిగా ఆడలేకపోయామని తీవ్రంగా స్పందించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు