Bengaluru Vs Chennai: బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్‌’ ఛాన్స్‌.. అదెలాగంటే?

ఐపీఎల్ 17వ సీజన్‌లో క్రికెట్ అభిమానులు శనివారం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాకౌట్‌ దశకు వెళ్లే నాలుగో జట్టు ఏంటా? అనేది తేలేదప్పుడే.

Updated : 18 May 2024 12:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్లేఆఫ్స్‌ రేసులోని నాలుగు బెర్తుల్లో ఒక్కటి మాత్రమే ఇంకా ఫిల్‌ కాలేదు. దానికోసం చెన్నై - బెంగళూరు బరిలో నిలిచాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వర్షం పడి మ్యాచ్‌ రద్దు అయితే చెన్నై నేరుగా నాకౌట్‌కు వెళ్లిపోతుంది. ఒకవేళ మ్యాచ్ జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం.

  • చెన్నై ఏడు మ్యాచుల్లో గెలిచి 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. బెంగళూరు ఆరు విజయాలతో 12 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. 
  • వర్షం పడి మ్యాచ్‌ రద్దయితే.. చెన్నై ఖాతాలోకి 15 పాయింట్లు వస్తాయి. దాంతో ఎలాంటి ఇబ్బందిలేకుండా ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్తుంది.
  • అప్పుడు ఆర్సీబీ 13 పాయింట్లతో ఇంటిముఖం పడుతుంది. దాంతోపాటు ఇప్పటికే పెద్దగా ఆశలు లేని దిల్లీ, లఖ్‌నవూ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే.
  • మ్యాచ్‌ జరిగి చెన్నై విజయం సాధిస్తే.. మరే ఇతర గణాంకాలతో సంబంధం లేకుండా నాకౌట్‌కు చేరుతుంది. ఒకవేళ ఓడినా సీఎస్కేకు అవకాశం ఉంది. 
  • అయితే... ఆ ఓటమి 18 పరుగుల లోపే ఉండాలి. ఒకవేళ బెంగళూరు గెలిచి ఇరుజట్ల పాయింట్లు సమమైతే.. మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ కారణంగా చెన్నైకే అవకాశం దక్కుతుంది. 

బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేస్తే..

  • మ్యాచ్‌ 20 ఓవర్లు, 19 ఓవర్లు జరిగితే చెన్నై ముందు 200 పరుగుల లక్ష్యం పెట్టాలి. ఆ జట్టును 182కే కట్టడి చేయాలి.
  • మ్యాచ్‌ 18 ఓవర్లు జరిగితే 190 పరుగులు చేయాలి.. సీఎస్కేను 172కే పరిమితం చేయాలి.
  • 17 ఓవర్లలో 180 రన్స్‌ చేస్తే.. సీఎస్కేను 162 రన్స్‌కే నియంత్రించాలి.
  • 16 లేదా 15 ఓవర్లు జరిగితే ఆర్సీబీ 170 పరుగులు చేయాలి. చెన్నైను 152కే కట్టడి చేయాలి.
  • కనీసం 5 ఓవర్ల గేమ్‌ జరిగినప్పుడు బెంగళూరు 80 పరుగులు చేస్తే.. చెన్నైను 62కే పరిమితం చేయాలి. 

ఆర్సీబీ సెకండ్‌ బ్యాటింగ్‌ అయితే..

  • 20 ఓవర్ల గేమ్‌ జరిగి ఆర్సీబీ తొలుత బౌలింగ్‌ చేసి.. సెకండ్‌ బ్యాటింగ్‌ చేస్తే సమీకరణాలు ఇలా ఉన్నాయి.
  • చెన్నై నిర్దేశించే 201 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే పూర్తి చేయాలి.
  • 19 ఓవర్ల మ్యాచ్‌ అయితే 17.1 ఓవర్లలోనే 201 రన్స్‌ను ఛేదించాలి. 
  • ఒకవేళ మ్యాచ్‌ 18 ఓవర్లు.. 191 పరుగుల లక్ష్యమైతే.. ఆర్సీబీ 16.1 ఓవర్లలోనే పూర్తి చేయాలి.
  • మ్యాచ్‌ 17 ఓవర్లు అయితే.. 181 రన్స్‌ టార్గెట్‌ను 15.1 ఓవర్లలోనే ఛేదించాలి. 
  • మ్యాచ్‌ 16 లేదా 15 ఓవర్లు జరిగి.. లక్ష్యం 171 పరుగులైతే.. ఆర్సీబీ 11 బంతులు మిగిలిఉండగానే విజయం సాధించాలి.
  • వర్షం కారణంగా మ్యాచ్‌ కనీసం 5 ఓవర్లకు కుదిస్తే.. అప్పుడు 81 పరుగుల టార్గెట్‌ ఎదురైతే 3.1 ఓవర్లలోనే ఛేదించాలి.

👉 చెన్నైకి గోల్డెన్ ఛాన్స్‌.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!

👉 కోహ్లీకి కలిసొచ్చే ‘నంబర్‌ 18’.. ఆర్సీబీని ప్లేఆఫ్స్‌కు చేరుస్తుందా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని