WTC Final : జరిమానాలు పని చేయవు.. ఓవర్‌కు 20 పరుగులు ఇవ్వాలి : ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌

క్రికెట్‌లో స్లో ఓవర్‌ రేట్‌(Slow Over Rate) కారణంగా ఆయా జట్లపై విధిస్తున్న జరిమానాలపై ఇంగ్లాండ్‌ మాజీ దిగ్గజం స్పందించాడు.

Published : 13 Jun 2023 18:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : WTC Finalలో స్లో ఓవర్‌ రేట్‌(Slow Over Rate) కారణంగా ఇరు జట్లకు ఐసీసీ(ICC) భారీ జరిమానా విధించిన విషయం తెలిసిందే. మొత్తం మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా 44 ఓవర్లు కోల్పోవడంతో.. పలువురు దీనిపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాల్లో జరిమానాలు పనిచేయవని ఇంగ్లాండ్‌ మాజీ దిగ్గజం మైఖెల్‌ వాన్‌(Michael Vaughan) అన్నాడు. కేవలం జరిమానాలతోనే.. ఇలాంటివి భవిష్యత్‌లో జరగకుండా ఆపలేమని అభిప్రాయపడ్డాడు. దీనికి ఓ పరిష్కారాన్ని కూడా సూచించాడు.

‘స్లో ఓవర్‌రేట్‌ కారణంగా WTC Finalలో దాదాపు సగం రోజు ఆటను కోల్పోయాం.. దీనిని ఎలా నియంత్రించాలి?’ అంటూ ఓ క్రీడా ఛానల్‌ పెట్టిన ట్వీట్‌కు మైఖెల్‌ వాన్‌ బదులిచ్చాడు. ‘ఇలాంటి విషయాల్లో జరిమానాలు పనిచేయవు. చివరి రోజున బ్యాటింగ్‌ చేస్తున్న జట్టుకు పరుగులను అదనంగా ఇవ్వాలి. ఒక్కో ఓవర్‌కు 20 పరుగుల చొప్పున ఇవ్వాలి. అదే దీనికి పరిష్కారం’ అంటూ సూచించాడు.

స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా భారత జట్టుకు ఐసీసీ (ICC) భారీ జరిమానా విధించింది. రోహిత్‌ సేన మొత్తానికి మ్యాచ్‌ ఫీజులో 100శాతం కోత విధిస్తున్నట్లు వెల్లడించింది. అటు టైటిల్‌ గెలిచిన ఆస్ట్రేలియా (Australia)కూ జరిమానా తప్పలేదు. స్లో ఓవర్‌ రేట్‌ (Slow Over Rate) కారణంగా ఆసీస్‌ జట్టుకు వారి మ్యాచ్‌ ఫీజులో 80శాతం కోత విధించింది. ఈ మేరకు ఐసీసీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని