Gautam Gambhir: ‘భారత కోచ్‌గా గంభీర్‌ ఫిక్స్‌.. ప్రకటనే తరువాయి!’

భారత జట్టు ప్రధాన కోచ్‌గా ఎవరు వస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, గంభీర్‌ నియామకంపై బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

Published : 29 May 2024 11:42 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా ఛాంపియన్‌గా నిలిచింది. భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) మెంటార్‌గా ఉంటూ జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడినే టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా తీసుకోవాలనే సూచనలు వచ్చాయి. ఇప్పటికే కోచ్‌ పదవి కోసం దరఖాస్తుల గడువు కూడా ముగిసిన సంగతి తెలిసిందే. అయితే గంభీర్ ఎంపిక ఇప్పటికే  జరిగిపోయిందని.. ప్రకటనే తరువాయి అని తాజాగా వస్తున్న కథనాలు చెబుతున్నాయి. బీసీసీఐ వర్గాలకు చాలా దగ్గరగా ఉండే ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఓనర్‌ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

క్రిక్‌బజ్‌ రిపోర్ట్‌ ప్రకారం.. ‘‘ఇప్పటికే భారత జట్టు ప్రధాన కోచ్‌గా గంభీర్‌ ఎంపిక జరిగింది. ఫ్రాంచైజీతో చర్చలు కూడా జరిగాయి. అతడి అపాయింట్‌మెంట్‌ను ప్రకటించడమే ఆలస్యం. ఇదే మాటను ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఓనర్‌తోపాటు హై ప్రొఫైల్‌ కలిగిన కామెంటేటర్‌ ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. కేకేఆర్‌ మెంటార్‌గా గంభీర్‌ చేసిన కృషి అతడిని ఈ పదవికి తీసుకొచ్చింది’’ అని పేర్కొంది. 

ధోనీ ఇప్పుడు కష్టమే.. 

గంభీర్‌ కాకుండా ఎంఎస్ ధోనీకి (MS Dhoni) ఈ అవకాశం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం కొందరు మాజీల్లో ఉంది. అయితే, ప్రస్తుతం అతడు సీఎస్కేకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దరఖాస్తు చేసే వ్యక్తి అంతర్జాతీయంతోపాటు అన్ని ఫార్మాల క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయి ఉండాలి. కానీ, ధోనీ ఇంకా ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. ఇక భారత జట్టు ప్రధాన కోచ్‌ పదవి కోసం 3వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. అయితే, వీటిల్లో ఫేక్‌ అప్లికేషన్లు కూడా ఉన్నాయి. మోదీ, షారుక్ ఖాన్, సచిన్.. ఇలా వారి పేరిట దరఖాస్తు చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని