WI vs IND: వదలని వరుణుడు.. విండీస్‌తో రెండో టెస్టు డ్రా

వెస్టిండీస్,భారత్‌ మధ్య రెండో టెస్ట్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. చివరి రోజు భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ నిర్వహణ సాధ్య కాలేదు. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగినట్లు అంపైర్లు ప్రకటించారు.

Updated : 25 Jul 2023 01:23 IST

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: వెస్టిండీస్, భారత్‌ మధ్య రెండో టెస్ట్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో ఐదో రోజు ఒక్క ఓవర్‌ కూడా మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఐదో రోజు తొలి సెషన్‌ ప్రారంభం కావడానికి ముందు నుంచే మ్యాచ్‌ జరిగే స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో వాన ఎంతకీ తగ్గకపోవడంతో లంచ్‌ బ్రేక్‌ ప్రకటించారు. తర్వాత వర్షం ఆగిపోవడంతో మ్యాచ్‌ను 10: 45 గంటల నుంచి మ్యాచ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే చిరుజల్లులు కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఈ క్రమంలోనే భారీ వర్షం కురిసింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చి డ్రాగా ముగిసినట్లు ప్రకటించారు.  

రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో మొదటి నుంచి భారత్‌ ఆధిపత్యం చూపించింది. టాస్‌ ఓడి తొలి ఇన్నింగ్స్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 438 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన విండీస్‌ 255 పరుగులకే ఆలౌట్‌ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగుల ఆధిక్యాన్ని సంంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌ను భారత్‌ 181/2 వద్ద డిక్లేర్‌ చేసి ఆతిథ్య జట్టుకు 365 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలోనే విండీస్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 76/2 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో (5/60)తో అదరగొట్టిన మహ్మద్‌ సిరాజ్‌  ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. జులై 27 నుంచి వెస్టిండీస్‌, భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభంకానుంది. 

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ - 438 ఆలౌట్‌
విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ - 255 ఆలౌట్‌

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ - 181/2 డిక్లేర్డ్‌
విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌ - 76/2

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు