హిమతేజకు కాంస్యం

‘ఈనాడు’ సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్‌ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్‌లో జరిగిన ఆసియా జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో అతడు కాంస్యంతో మెరిశాడు.

Published : 29 Apr 2024 01:48 IST

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఈనాడు’ సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్‌ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్‌లో జరిగిన ఆసియా జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో అతడు కాంస్యంతో మెరిశాడు. పురుషుల 4×100 మీటర్ల రిలే పరుగులో హిమతేజ, కార్తికేయన్‌ సౌందరరాజన్‌, మహేంద్ర, రోహన్‌ ఘోష్‌లతో కూడిన బృందం 40.01 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని