క్వార్టర్స్‌లో భారత్‌

ప్రతిష్టాత్మక ఉబెర్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో భారత్‌ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్‌-ఏ పోరులో 4-1తో సింగపూర్‌ను ఓడించింది.

Published : 29 Apr 2024 01:50 IST

ఉబెర్‌ కప్‌ బ్యాడ్మింటన్‌

చెంగ్‌డూ (చైనా): ప్రతిష్టాత్మక ఉబెర్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో భారత్‌ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్‌-ఏ పోరులో 4-1తో సింగపూర్‌ను ఓడించింది. తొలి సింగిల్స్‌లో అష్మిత చాలిహా 15-21, 18-21తో యె జియా మిన్‌ చేతిలో ఓడిపోయింది. డబుల్స్‌లో ప్రియ-శ్రుతి మిశ్రా జంట 21-15, 21-16తో హెంగ్‌-జిన్‌ యు జియా జోడీని ఓడించి స్కోరు సమం చేసింది. రెండో సింగిల్స్‌లో ఇషా రాణి 21-13, 21-16తో ఇన్సియిరా ఖాన్‌పై గెలవడంతో భారత్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో డబుల్స్‌లో సిమ్రన్‌ సింఘి-రితిక జోడీ 21-8, 21-11తో యీ తింగ్‌-జాన్‌ మిచెలీ జంటపై.. తర్వాత సింగిల్స్‌లో అన్మోల్‌ 21-15, 21-13తో లీ మెగాన్‌పై నెగ్గి ఘనవిజయాన్ని అందించారు. థామస్‌ కప్‌లో భారత్‌ శుభారంభం చేసింది. గ్రూప్‌-సి తొలి పోరులో 4-1తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. తొలి సింగిల్స్‌లో ప్రణయ్‌ 20-22, 14-21తో కున్లావత్‌ విదిత్‌సర్న్‌ చేతిలో ఓడినా.. డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజు-చిరాగ్‌శెట్టి జంట 21-19, 19-21, 21-12తో పీరాట్‌చాయ్‌-పక్కాపోన్‌ ద్వయంపై గెలిచి స్కోరు సమం చేసింది. రెండో సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ 21-12, 19-21, 21-16తో పనిట్‌చాపోన్‌పై.. డబుల్స్‌లో అర్జున్‌-ధ్రువ్‌ జంట 21-19, 21-15తో టనాడాన్‌-వాచిరావిత్‌ జోడీపై నెగ్గడంతో భారత్‌ 3-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఆఖరి సింగిల్స్‌లో శ్రీకాంత్‌ 21-9, 21-5తో శరణ్‌ను ఓడించి భారత్‌ను 4-1తో గెలిపించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని