పారిస్‌కు ఏడుగురు షట్లర్లు

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్‌ క్రీడల అర్హత ర్యాంకింగ్‌ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్‌), హెచ్‌ఎస్‌.ప్రణయ్‌, లక్ష్యసేన్‌ (పురుషుల సింగిల్స్‌), సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి (పురుషుల డబుల్స్‌), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్‌) ఈ మెగా ఈవెంట్‌ బరిలో నిలిచారు.

Published : 30 Apr 2024 03:55 IST

దిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్‌ క్రీడల అర్హత ర్యాంకింగ్‌ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్‌), హెచ్‌ఎస్‌.ప్రణయ్‌, లక్ష్యసేన్‌ (పురుషుల సింగిల్స్‌), సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి (పురుషుల డబుల్స్‌), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్‌) ఈ మెగా ఈవెంట్‌ బరిలో నిలిచారు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడానికి ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య విధించిన గడువు సోమవారంతో ముగిసింది. తాజా బీడబ్ల్యూఎఫ్‌ ఒలింపిక్‌ ర్యాంకింగ్‌ ప్రకారం టాప్‌-16లో ఉన్న షట్లర్లు పారిస్‌ టికెట్‌ దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో రెండుసార్లు పతక విజేత సింధు (12), ప్రణయ్‌ (9), లక్ష్యసేన్‌ (13) సింగిల్స్‌లో.. సాత్విక్‌-చిరాగ్‌ (3), అశ్విని-తనీషా (13) డబుల్స్‌లో ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం వచ్చింది. పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జంట ఛాన్స్‌ కోల్పోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని