సంక్షిప్త వార్తలు (4)
కివీస్‌దే వన్డే సిరీస్
హామిల్టన్ (న్యూజిలాండ్): ఇంగ్లాండ్‌తో మూడు వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే న్యూజిలాండ్ 2-0తో చేజిక్కించుకుంది. బుధవారంరెండో వన్డేలో కివీస్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ టిక్నర్ (4/34) ధాటికి మొదట ఇంగ్లాండ్ 36 ఓవర్లలో 175 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (34; 34 బంతుల్లో 3×1, 1×6), జేమీ ఒవర్టన్ (42; 28 బంతుల్లో 4×4, 2×6) పర్వాలేదనిపించారు. కివీస్ 16.5 ఓవర్లు మిగిలివుండగానే 5 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రచిన్ రవీంద్ర (54; 58 బంతుల్లో 7×4, 1×6), మిచెల్ (56 నాటౌట్; 59 బంతుల్లో 6×4, 2×6) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ (3/23) ఆకట్టుకున్నాడు.
జైవీర్‌కు రజతం
రచన, కోమల్‌లకు కాంస్యాలు
బహ్రెయిన్: యూత్ ఆసియా క్రీడల్లో భారత రెజ్లర్ జైవీర్ సింగ్ రజతం సాధించాడు. బాలుర 55 కేజీల ఫ్రీస్టైల్ విభాగం ఫైనల్లో అతను 2-6తో జపాన్ రెజ్లర్ యమటో ఫురుసావా చేతిలో ఓటమి పాలయ్యాడు. రెజ్లింగ్ బాలికల 43 కేజీల విభాగంలో రచన కాంస్యం సాధించింది. ఆమె కంచు పోరులో 11-0తో ప్రత్యర్థిని చిత్తు చేసింది. 49 కేజీల ఫ్రీస్టైల్‌లో కోమల్ వర్మ.. జియాకింగ్‌ను ఓడించి కాంస్యం నెగ్గింది. గౌరవ్ పునియా (65 కేజీలు ఫ్రీస్టైల్), మోని (57 కేజీల ఫ్రీస్టైల్), అశ్విని వైష్ణోయ్ (69 కేజీల ఫ్రీస్టైల్) స్వర్ణాల కోసం పోటీ పడనున్నారు.
పాకిస్థాన్ స్థానంలో ఒమన్
లౌసానె: జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ స్థానంలో ఒమన్ ఆడనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ధ్రువీకరించింది. చెన్నై, మదురైలలో నవంబరు 28 నుంచి జరగాల్సిన ఈ టోర్నీ నుంచి పాకిస్థాన్ వైదొలగడంతో ఒమన్‌కు అవకాశం దక్కింది. ఈ టోర్నమెంట్లో మొత్తం 24 జట్లు పోటీపడతాయి. జట్లను ఆరు గ్రూపులుగా విభజించారు.
డిఫెండింగ్ ఛాంపియన్‌కు అనాహత్ షాక్
టొరంటో (కెనడా): భారత క్రీడాకారిణి అనాహత్ సింగ్ కెనడియన్ ఉమన్స్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్‌ఫైనల్లో ఆమె 3-0 (12-10, 11-9, 11-9)తో డిఫెండింగ్ ఛాంపియన్, రెండో సీడ్ టిన్ గిలిస్ (బెల్జియం)కు షాకిచ్చింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో గిలిస్ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. టాప్-10 ప్లేయర్‌పై గెలవడం ఆమెకిదే తొలిసారి. అనాహత్ సెమీఫైనల్లో ప్రపంచ నంబర్ 10 జినా కెనెడీతో తలపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

వన్డే వరల్డ్ కప్ విజయం.. అమాంతం పెరిగిన భారత క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ!
కొన్ని దశాబ్దాల నిరీక్షణకు తెర దించుతూ భారత మహిళల జట్టు (Team India) వన్డే వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. - 
                                    
                                        

కథానాయకి
మేటి క్రికెటర్లందరూ గొప్ప కెప్టెన్లు అవుతారనే గ్యారెంటీ లేదు. అందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. కానీ కొందరిని చూస్తే సహజ నాయకుల్లా కనిపిస్తారు. - 
                                    
                                        

కసి రేగెను.. కథ మారెను
నెల కిందట మహిళల వన్డే ప్రపంచకప్ ఆరంభమవుతున్నపుడు.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లాంటి మేటి జట్లను వెనక్కి నెట్టి భారత మహిళల జట్టు విజేతగా నిలవగలదని అనుకున్నామా? - 
                                    
                                        

అంబరాన్ని అంటిన సంబరాలు
దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో వన్డే ప్రపంచకప్ అందుకున్న భారత్.. ఆదివారం రాత్రంతా సంబరాలు చేసుకుంది. ‘‘మువ్వన్నెల జెండా.. ఉవ్వెత్తున ఎగిరింది. - 
                                    
                                        

కోట్ల రూపాయలు.. వజ్రాల హారాలు
చరిత్రాత్మక వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టుపై నజరానాల వర్షం కురుస్తోంది. హర్మన్‌ప్రీత్ బృందానికి బీసీసీఐ రూ.51 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. - 
                                    
                                        

ఈ 7 గంటలు మీవే కావాలి..
చక్‌దే ఇండియా సినిమా గుర్తుందా? భారత మహిళల హాకీ జట్టు కోచ్ కబీర్‌ఖాన్ (షారుక్ ఖాన్) ఫైనల్‌కు ముందు తన ప్లేయర్లలో ఎలాగైనా గెలవాలన్న కాంక్షను రగిలిస్తాడు. - 
                                    
                                        

పాపం.. ప్రతీక
ప్రతీక రావల్ ఈ ప్రపంచకప్‌లో భారత్ తరఫున రెండో అత్యధిక స్కోరర్. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు(5)
భారత స్టార్ దివ్య దేశ్‌ముఖ్.. చెస్ ప్రపంచకప్‌లో ఓడిపోయింది. ఈ మహిళల ప్రపంచకప్ విజేత.. తొలి రౌండ్లో 0-2తో అర్డిటిస్ (గ్రీస్) చేతిలో పరాజయం చవిచూసింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

నన్ను ఇబ్బంది పెట్టకండి: బండ్ల గణేశ్ పోస్టు
 - 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 


