ICC: ఐసీసీ ఛైర్మన్‌గా మళ్లీ ఆయనే..!

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ఛైర్మన్‌గా గ్రెగ్‌ బార్‌క్లే రెండోసారి కొనసాగనున్నారు. ఐసీసీ ఛైర్మన్‌ పదవికి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Published : 12 Nov 2022 11:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ ICC) ఛైర్మన్‌గా గ్రెగ్‌ బార్‌క్లే మరోసారి నియమితులయ్యారు. శనివారం జరిగిన ఐసీసీ సమావేశంలో గ్రెగ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్‌ 2020 నవంబరులో తొలిసారిగా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఏడాది నవంబరుతో ఆయన పదవీకాలం ముగియనుండగా.. ఛైర్మన్‌ పదవికి ఎన్నికలు నిర్వహించారు. ఈ పదవికి జింబాబ్వేకు చెందిన తవెంగ్వా ముకులానీ కూడా పోటీ చేసినప్పటికీ.. చివరి నిమిషంలో నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత బీసీసీఐ సహా 17 మంది ఐసీసీఐ బోర్డు సభ్యులు గ్రెగ్‌కు మద్దతివ్వగా.. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రెగ్‌ గతంలో న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరించారు. అంతకుముందు 2015లో ఐసీసీ పురుషుల క్రికెట్‌ వరల్డ్‌కప్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని