India World Cup 2023 Squad: ఆశ్చర్యం కలిగించింది.. అతడు ప్యూర్‌ మ్యాచ్‌ విన్నర్‌: హర్భజన్‌ సింగ్‌

వన్డే ప్రపంచ కప్‌ కోసం ప్రకటించిన జట్టు(India World Cup 2023 Squad)లో చాహల్‌ లేకపోవడంపై మాజీ ఆటగాడు హర్భజన్‌ స్పందించాడు.

Updated : 06 Sep 2023 12:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) కోసం టీమ్‌ఇండియా(Team India) జట్టును బీసీసీఐ (BCCI) మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌ కోసం అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ.. అందరూ ఊహించిన జట్టు (India World Cup 2023 Squad)నే ఎంపిక చేసింది. అయితే.. ఇందులో కొందరు ఆటగాళ్లకు స్థానం లభించకపోవడంపై మాజీలు స్పందిస్తున్నారు. ముఖ్యంగా స్పిన్నర్‌ చాహల్‌(Yuzvendra Chahal )ను తీసుకోకపోవడంపై మాజీ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌(Harbhajan Singh) ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

‘ప్రపంచకప్‌ జట్టులో యుజ్వేంద్ర చాహల్‌ లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అతడు ప్యూర్‌ మ్యాచ్‌ విన్నర్‌’ అని హర్భజన్‌ ఎక్స్‌ (ట్విటర్‌)లో పేర్కొన్నాడు.

ప్రశ్నలు అలాగే..

ఇక నిన్న ప్రకటించిన జట్టులో.. స్పిన్‌ విభాగంలో కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, జడేజాకు చోటు కల్పించారు. లెగ్‌స్పిన్నర్‌ చాహల్‌కు నిరాశ తప్పలేదు. అశ్విన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ కూడా లేని నేపథ్యంలో ప్రపంచకప్‌లో భారత్‌కు ఆఫ్‌స్పిన్నర్‌ సేవలు అందుబాటులో ఉండవు. జట్టు సమతూకం కోసమే శార్దూల్‌, అక్షర్‌లను ఎంచుకున్నామని రోహిత్‌ శర్మ చెప్పాడు.

భారత ప్రపంచకప్‌ జట్టు: రోహిత్‌, శుభ్‌మన్‌ గిల్‌, కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌, జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, శార్దూల్‌, షమి, సిరాజ్‌, బుమ్రా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని