Asia Cup: వరుణా వదలవా..! పాకిస్థాన్‌తో సూపర్‌ మ్యాచ్‌కూ వర్షం ముప్పు?

ఆసియా కప్‌ గ్రూప్‌ దశలో భారత్, పాకిస్థాన్‌ (IND vs PAK) మధ్య జరిగిన మ్యాచ్‌ వర్షార్పణం కాగా.. ఈ ఇరుజట్ల మధ్య జరిగే సూపర్‌-4 మ్యా్చ్‌కు వరుణుడి మప్పు పొంచి ఉంది. 

Published : 09 Sep 2023 17:11 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌ (Asia Cup 2023) గ్రూప్‌ దశలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ (IND vs PAK) మధ్య జరిగిన మ్యాచ్‌ వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుజట్ల అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సూపర్‌-4లో ఈ రెండు జట్లు మరోసారి తలపడుతుండటంతో ఫ్యాన్స్‌ ఖుషీ అయ్యారు. కానీ, ఈ మ్యాచ్‌కూ వరుణుడి ముప్పు పొంచి ఉంది. మ్యాచ్‌ జరిగే సెప్టెంబరు 10న కొలంబోలో 90 శాతం వర్షం కురిసే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యంగా సాయంత్రం వేళలో వర్షం కురిసే ఛాన్స్‌ ఎక్కువగా ఉందని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. రిజర్వ్‌ డే అయిన మరుసటి రోజు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా. దీంతో ఇరుజట్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ మ్యాచ్‌కైనా వరుణుడు కరుణించాలని ప్రార్థిస్తున్నారు. 

చైనామన్‌ చిన్నోడు.. ఫీనిక్స్‌లా లేచాడు

అర్ష్‌దీప్‌ను ప్రపంచకప్‌నకు ఎందుకు ఎంపిక చేయలేదు?: భారత మాజీ కోచ్

యువ ఫాస్ట్‌బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ (Arshdeep Singh)ను వన్డే ప్రపంచకప్‌నకు ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ బౌలింగ్ కోచ్‌ భరత్‌ అరుణ్ (Bharat Arun) ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అతడిని జట్టులోకి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించాడు.  2022లో టీ20ల్లో అడుగుపెట్టిన అర్ష్‌దీప్‌.. అదే ఏడాది న్యూజిలాండ్‌పై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. టీ20ల్లో అవకాశాలు వస్తున్నా వన్డే జట్టులో మాత్రం ఆశించిన మేరకు ఛాన్స్‌లు రావడం లేదు. అతడు ఇప్పటివరకు మూడే వన్డేలు ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియాకప్‌లో కూడా అర్ష్‌దీప్‌ సింగ్‌కు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్‌ గురించి మాజీ కోచ్ భరత్ అరుణ్ మాట్లాడాడు. ‘‘మేం టీమ్‌ఇండియా కోచింగ్ సిబ్బంది భాగంగా ఉన్నప్పుడు ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లను జట్టులో తీసుకురావడానికి  ప్రయత్నించాం. అర్ష్‌దీప్‌ బాగా బౌలింగ్‌ చేస్తాడు. ప్రపంచకప్‌ జట్టులో అతడికి ఎందుకు అవకాశం ఇవ్వలేదో నాకు తెలియదు. నాకైతే అతడి ప్రదర్శన ఎంతో నచ్చింది.  యార్కర్లు కూడా వేయగలడు. అతడు ఉత్తేజకరమైన ఫాస్ట్‌ బౌలర్. ఇప్పుడు అతడి పరిస్థితిని చూస్తే ఆశ్చర్యమేస్తుంది’’ అని భరత్ అరుణ్ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని