SRH: ఐపీఎల్‌ మెగా వేలం.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కావ్య మారన్.. ఇంతకీ ఎవరామె?

ఐపీఎల్ మెగా వేలం ఆసక్తికరంగా సాగుతోంది. నాణ్యమైన ఆటగాళ్లను సొంతం చేసుకోవటం కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. గత కొన్ని సీజన్ల నుంచి పేలవ ప్రదర్శన చేస్తున్న సన్‌రైజర్స్‌

Published : 13 Feb 2022 01:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఐపీఎల్ మెగా వేలం ఆసక్తికరంగా సాగుతోంది. నాణ్యమైన ఆటగాళ్లను సొంతం చేసుకొనేందుకు ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాయి. గత కొన్ని సీజన్ల నుంచి పేలవ ప్రదర్శన చేస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు జట్టును పునర్‌వ్యవస్థీకరించడానికి ఈ మెగా వేలం రూపంలో మంచి అవకాశం వచ్చింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, అబ్దుల్ సమద్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లను ఎస్ఆర్‌హెచ్‌ రిటెన్షన్‌ చేసుకుంది.  ప్రస్తుతం జరుగుతున్న మెగా వేలంలో కనీస ధర రూ.1.5 కోట్లు ఉన్న వెస్టిండీస్ వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ నికోలస్ పూరన్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.10.75 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసింది. టీమ్‌ఇండియా యువ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ రూ.8.75 కోట్లు, భువనేశ్వర్‌ కుమార్‌ రూ. 4.20 కోట్లు, నటరాజన్‌లను రూ.4 కోట్లకు సొంతం చేసుకుంది. 

కావ్య మారన్‌ ఎవరు?

ఇదిలా ఉండగా.. వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సన్‌రైజర్స్‌ మ్యాచ్‌లు ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్లి జట్టు ఆటగాళ్లలో హుషారు నింపే ప్రయత్నం చేస్తుంటారామె. ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు కెమెరాల ఫోకస్ కూడా ఆమెపైనే ఉంటుంది.  కావ్య మారన్‌ కోసమే మ్యాచ్ చూసేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇంతకీ ఈ కావ్య మారన్‌ ఎవరనుకుంటున్నారు? సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్ కుమార్తె. ఎంబీఏ పట్టా పొందిన కావ్య.. సన్ ‌నెట్‌వర్క్ సన్ మ్యూజిక్, ఎఫ్‌ఎం ఛానల్స్‌ బాధ్యతలను చూసుకుంటుంటారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని