Ishan Kishan: బీసీసీఐ అల్టిమేటం వేళ.. హార్దిక్‌తో ఇషాన్‌ జిమ్‌ వీడియో వైరల్‌

Ishan Kishan: దేశవాళీ క్రికెట్‌కు ఆడని యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌.. పాండ్యతో కలిసి జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఐపీఎల్‌ కోసం వీరిద్దరూ సన్నద్ధమవుతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

Updated : 23 Feb 2024 11:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత క్రికెట్ జట్టు (Team India)కు ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లు దేశవాళీ టోర్నీలేవీ ఆడకపోవడంపై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపై ఇప్పటికే బీసీసీఐ (BCCI) అల్టిమేటం జారీ చేసింది. ఈ పరిణామాల వేళ యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan)కు సంబంధించి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిలో మరో క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya)తో కలిసి అతడు జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్నట్లు ఉంది. 

మానసిక అలసటకు గురయ్యానంటూ గత డిసెంబరులో దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో ఇషాన్‌ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. నాటి నుంచి టీమ్‌ఇండియాకు దూరంగా ఉంటున్న అతడు.. దేశవాళీ క్రికెట్‌లోనూ ఆటడం లేదు. అతడితో పాటు పలువురు ఆటగాళ్లు కూడా వివిధ కారణాలతో రంజీల్లో ఆడకపోవడం దుమారం రేపింది. దీనిపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. దేశవాళీ క్రికెట్‌ ఆడితేనే జాతీయ జట్టులోకి తీసుకుంటామంటూ ఇటీవల బోర్డు గట్టిగా చెప్పింది. అయినా కూడా అతడు తన రాష్ట్ర క్రికెట్‌ సంఘాన్ని సంప్రదించలేదు.

ఐపీఎల్‌ వినోదం ముందే.. మార్చి 22 నుంచే 17వ సీజన్‌

ఈ పరిణామాల వేళ.. ఇషాన్‌ వీడియో వైరల్‌ అవడం చర్చకు దారితీస్తోంది. గతంలోనూ అతడు హార్దిక్‌తో కలిసి సాధన చేస్తున్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఐపీఎల్‌లో ఇషాన్‌ ముంబయికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని