India vs Nepal : భారత్ vs నేపాల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. పరిస్థితి ఏంటి?
ఆసియా కప్(Asia Cup 2023)లోని మ్యాచ్‌లపై వరుణుడి ప్రభావం పడుతోంది. ఇప్పటికే భారత్ vs పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. నేడు నేపాల్‌తో జరిగే మ్యాచ్‌కూ వర్షం ముప్పు పొంచి ఉంది.
ఇంటర్నెట్ డెస్క్ : ఆసియా కప్ (Asia Cup 2023 )లో ఇప్పటికే టీమ్ ఇండియా మ్యాచ్ ఒకటి వర్షం కారణంగా రద్దయింది. ఇప్పుడు మరో మ్యాచ్‌పై వర్షం ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో గ్రూప్ 4 పరిస్థితి ఏంటి? అనే చర్చ మొదలైంది. నేపాల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయితే ఎవరు సూపర్-4లోకి అడుగుపెడతారు, ఆ లెక్కేంటో చూద్దాం.
చిరకాల ప్రత్యర్థులు భారత్ - పాకిస్థాన్ (IND vs PAK) మధ్య శనివారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. అప్పటికే నేపాల్‌పై ఘన విజయం సాధించిన పాక్.. సూపర్ 4లోకి అడుగుపెట్టింది. మరోవైపు సోమవారం అదే పల్లెకెలె వేదికగా నేపాల్‌తో భారత్ (India vs Nepal) మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌పై కూడా వరుణుడి ప్రభావం ఉండే అవకాశాలున్నట్లు వాతావారణ నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే మైదానం ఓవైపు అంతా మేఘావృతం అయింది.
ఒలింపిక్స్‌లో క్రికెట్ దూకుడు..!
నేపాల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అయితే.. ఇరుజట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు టీమ్‌ఇండియా 2 పాయింట్లతో నేపాల్ కంటే ముందుంటుంది. దీంతో భారతే సూపర్ 4లోకి అడుగుపెడుతుంది. అప్పుడు గ్రూప్ A నుంచి భారత్, పాక్ సూపర్ 4కు చేరుకున్న జట్లుగా నిలుస్తాయి. ఒకవేళ నేపాల్ సూపర్ 4కు వెళ్లాలంటే.. భారత్‌పై తప్పక విజయాన్ని నమోదు చేయాలి. అలాగే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించకూడదు.
దీంతో మ్యాచ్ సజావుగా సాగాలని ఆ దేశం అభిమానులు కోరుకుంటున్నారు. అయితే.. పసికూన నేపాల్‌పై టీమ్‌ఇండియా గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మ్యాచ్ జరిగి ఆ జట్టుపై ఘనవిజయం సాధించాలనే టీమ్‌ఇండియా కోరుకుంటోంది. నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్
-
Rishi Sunak: ఉక్రెయిన్‌కు బ్రిటన్ సైనికులు.. రిషి సునాక్ స్పందన ఇదే!
-
Ghulam Nabi Azad: తదుపరి ‘ఎల్జీ’ అంటూ ప్రచారం.. గులాం నబీ ఆజాద్ ఏమన్నారంటే!
-
Uttar Pradesh : నాపై కక్షతో చేతబడి చేశారు.. యూపీ ఎమ్మెల్యే పోస్టు వైరల్
-
Meenakshi Chaudhary: మరో స్టార్హీరో సరసన మీనాక్షి చౌదరి.. ఆ వార్తల్లో నిజమెంత?
-
Congress: అజయ్ మాకెన్‌కు కీలక పదవి!