Revanth Reddy: ఎకరా పంట నష్టానికి రూ.10 వేలు పరిహారం.. ఇల్లు మునిగితే రూ.15 వేలు: సీఎం రేవంత్‌

Eenadu icon
By Telangana News Team Updated : 31 Oct 2025 18:57 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హనుమకొండ: ‘మొంథా’ తుపాను (Cyclone Montha) ప్రభావంతో తెలంగాణలోని 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం, దెబ్బతిన్న రోడ్లపై నివేదికలు తెప్పించాలని, ప్రజాప్రతినిధుల వద్దకు వచ్చిన నివేదికలను కలెక్టర్లకు పంపాలన్నారు. అన్ని నివేదికలు సమీకరించి నిర్ణీత విధానంలో కేంద్రానికి నివేదించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో వరదలపై సీఎం రేవంత్‌రెడ్డి హనుమకొండ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. తుపాను నష్టాలపై కేంద్ర నిధులు రాబట్టుకోవాల్సి ఉందని, ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని అధికారులకు సూచించారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. ధనిక రాష్ట్రమని కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వదులకునే ప్రసక్తే లేదన్నారు.

ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అందించాల్సిన ఆర్థిక సాయంపై గతంలో ఇచ్చిన జీవో ప్రకారం.. తాజా వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్లు మునిగిన వారికి రూ.15వేల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. గుడిసెలు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎకరా పంట నష్టానికి రూ.10వేలు చొప్పున, ఆవులు, గేదెలు మృత్యువాత పడితే రూ.50వేలు, మేకలు, గొర్రెలకు రూ.5వేలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

Tags :
Published : 31 Oct 2025 17:54 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు