Eatala rajender: నోరున్న కార్పొరేటర్లకే నిధులిచ్చే పద్ధతి మారాలి: ఎంపీ ఈటల

Eenadu icon
By Telangana News Team Published : 04 Jun 2025 15:44 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం వాడీవేడిగా కొనసాగుతోంది. హైదరాబాద్‌ మహా నగరంలో సమస్యలపై కార్పొరేటర్లు , ఎక్స్‌అఫిషియో సభ్యులు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, అధికారులంతా కలిసి చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో వీధి దీపాలు, నాలాల విస్తరణ, వరదల విలయం, ట్రాఫిక్‌ ఇబ్బందులు సహా పలు అంశాలపై ప్రశ్నలు, సమాధానాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భాజపా ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. నగరంలోని రైల్వే క్రాసింగ్‌ల వద్ద సమస్యలు పరిష్కరించాలని సూచించారు. నోరున్న కార్పొరేటర్లకే నిధులిచ్చే పద్ధతికాకుండా.. పార్టీలతో సంబంధం లేకుండా సమస్యలు ఉన్న అన్ని ప్రాంతాలకు నిధులు కేటాయించాలని కోరారు.

అనంతరం కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతూ.. మూసీ పునరుజ్జీవంలో కేంద్రం సహకారానికి ఈటల కృషిచేయాలని అడగ్గా.. అభివృద్ధికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. మేయర్‌ విజయలక్ష్మి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాక ఆర్‌వీ కర్ణన్‌ తొలిసారి హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని