సీఎం సార్‌... మీ హామీ నెరవేర్చండి

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 12 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాలని టెట్‌ ఉత్తీర్ణులై...టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కోరారు.

Published : 12 Jul 2023 03:55 IST

టెట్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థుల లేఖలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 12 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాలని టెట్‌ ఉత్తీర్ణులై...టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖలు రాసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం దిల్‌సుఖ్‌నగర్‌లో సమావేశమై మూకుమ్మడిగా లేఖలురాశారు. శాసనసభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాక ముందే టీఆర్‌టీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని వారు లేఖల్లో అభ్యర్థించారు. ఇప్పటికే టెట్‌లో ఉత్తీర్ణత సాధించి ఆరు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని